మేమెవరం?(కవిత)
మేమెవరం?
**********
భరతజాతిబిడ్డలం
భావి భారతీయులం
మీ దీపకళికలం
కోటి దివ్వె వెలుగులం
చదువుకునే పిల్లలం
పనులు నేర్చు మొల్లలం
ఊడిగాలు చేయబోం
వెట్టి పనికి లొంగబోం
నేర్చు కొనుట మా హక్కు
నేర్పించుట మీ ధర్మం
కన్నకడుపు మీదైతే
కనిపెంచుట మీధర్మం
కొనుక్కున్న చదువులొద్దు
కోరుకున్న చదువు ముద్దు
సంస్కారం సౌశీల్యం
సమానత్వ మనువాదం
ఎల్లప్పుడు అనుసరణీయం
*
బాలశాస్త్రవేత్త లంట
బహు బాగుగ వెలిగినారు
ఏమెదడున నేమున్నదొ
ఈ చిన్న బుర్రకేమితెలుసు
ఎప్పుడెవరు వెలిగెదరో
ఎవరి కేమి తెలుసు?
అబ్దుల్ కలాం గారు
ఆనాడనుకున్నడా
శాస్త్రవేత నైపోతా
ఈ దేశపు రాజు నైత
అనుకోలేదన్నెడూ
జనం మధ్యబుట్టి పెరిగి
జనం నేత అయ్యాడు
పిల్లలంటే ప్రేమయ్యీ
పిల్లల్లో తిరిగాడూ
పిల్లల్లో కొలువయ్యీ
తనువును చాలించాడూ
నింగి కెగసి తారకయై
తళతళ మెరుస్తున్నాడు
నాటికీ నేటికీ యేనాటికైన
మనకతడే ఆదర్శం
మనకతడే ఆదర్శం!!
*******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి