మరో మారణ హోమమే!(కవిత)

మరో మారణ హోమమే!
*********************
జలము లేక బలము లేదు
నీరు లేక నిప్పు లేదు
జలమే జీవికి ప్రాణాధారం
ఆ జీవే తన అధరవును
పోగొట్టుకుంటుంటే 
మూగజీవుల రోదన 
మనల ముచ్చెమటలు
పట్టించవా!
వనాల కొట్టేసి వన్యప్రాణుల
నీడ లేకుండా జేస్తే
నిస్తేజమై నిస్త్రాణ గా
మిగిలిన ఆప్రాణులు
జనజీవన స్రవంతిలో
కలిస్తే మనకీ వాటికీ సమరమే!
మరో మారణహోమమే!
           *****
              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు