ఎవరు ప్రజలు?(కవిత)
ఎవరు ప్రజలు?
**************
సామంతరాజుల సఖ్యత
చక్రవర్తుల తలబొప్పి కట్టిందా!
నిరసన ప్రజలు, ప్రభుత్వం మధ్యనో
పాలకులు,పాలకుల మధ్యనో తెలియకున్నది
కండువా కప్పుకున్నోల్లంతా
పాలక వర్గం లో భాగమే
పాలక వర్గం అంటే ఒక పార్టీ యే
పార్టీ జెండాను మోసే మనిషి
ప్రజల వాక్యమనుకోలేము
అసలైన ప్రజలు పాలకులనర్థిస్తారే తప్ప
పాలకులనెండగట్టరు!
భరిస్తారు! బాధపడతారు!
జ్వాలలెగయని నిరసన వెలిబుచ్చుతారు!
వారే నిజమైన ప్రజలు....
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి