ఓటు!(కవిత)
కవితా శీర్షిక:. ఓటు
మంచోనికి ఓటెయ్ మని
చెప్పువాడె ఘనుడు
ఆ మంచోడెవడొ
తెల్యజెప్ఫు ఘనుడా!!
.....
తాయిలాల హామీలే
తంపులు బెట్టు రకాలాయె
వర్గాలుగ చీలి పోయి
ఎబ్బెట్టుగ మారిపోయె!!
.....
సద్భావం సమభావం
అసలె కానరాదాయె
చీడ పీడ తగిలి నట్లు
చిందర వందరనాయె!!
.....
రాజకీయ మంటే
వృత్తి లాగ మారిపోయె
సొంత లాభమే సాంతం
సరసంగా ఉండిపాయె!!
.....
---యెనిశెట్టి గంగా ప్రసాద్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి