జయహో మహిళా!(పాట)

శీర్షిక:   జయహో మహిళా!

కవి పేరు:  యెనిశెట్టి గంగా ప్రసాద్.

వీర మాతలు వీరపత్నులు
వీర వనితలు యెందరో
నిలిచినారు చరిత్రయందు
కోటివెలుగుల కాంతితో!

కాకతీయుల రుద్రమ
కదిలి వచ్చిన కనకదుర్గయె
ఝాన్సిరాణి పోరు సల్పిన
భరత ఖండపు ఆణిముత్యం!

కవుల కలమున నిలిచినట్టీ
కథానాయిక మొల్లయే
రామ కావ్యం వ్రాసి నిలిచెను
కవన వనమున మణి పూసయై

ఉద్యమించెను స్త్రీ విద్యకు
శంఖమూదె సావిత్రి భాయీ! 
దుర్గయై కదిలింది నాడూ
దుర్గా బాయీ దేశ్ ముఖ్!

కదిలి నారూ నేడుయెందరో
మహిళా మణులు కదిలిరీ!
అన్ని రంగములాక్రమించీ
అభివృద్ధి పథమున నిలచుచుండిరి!

జయహో మహిళా
జయం నీకు జయం!
నాడు నీవే నేడు నీవే
రేపు నీవే రాబోవు తరం నీదెలే!!
              ********

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)