వనవిహారం!(కవిత)

                         వనవిహారం!
************
ఓ వనం!
ఆ వనంలో మనం!
మనం చిన్నారుల్తొ,
ఆట పాటలతొ
మనకూ వారికీ మధ్య
అనుబంధాలు
మమతానురాగాలు
వారాంతపు సెలవుల్లొ
ఎంత హాయి
పిల్లల కేరింతలు
పెద్దలకదే వినోదం, విశ్రాంతి!
వారంలోని అలసట
వారాంతంలొ విశ్రాంతి!
పిల్లలతొ అనుబంధానికి పునాది!
ప్రతి రోజూ ఆఫీసుతో కుస్తీ
ఇంటికొస్తె పిల్లల హోంవర్క్ తొ కుస్తీ!
మార్కులు రాలేదని లొల్లి
ఇద్దరి మధ్య అంతరం ఏర్పడేదక్కడే,
తల్లిదండ్రులు కోరుకునేదొకటి
పిల్లలమననసునకందనిది
అదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేది,
మధ్యతరగతి మానవునికేదీ విశ్రాంతి!
అందుకే వారాంతంలొ
వనకేళీ విశ్రాంతికి పునాది
అందుకే కూరిమితో వివరిస్తె
ఆలోచనలకందివచ్చే పిల్లలు
కారా మన ఆలోచనలకు ప్రతిరూపాలు!
వారే మన భవితకు వారసులు!!
             ......:::::::::......
                        -----యెనిశెట్టి గంగాప్రసాద్
                                       కామారెడ్డి
                              సెల్:9866447234 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)