వినతి!(పాట)

                వినతి
                ******
మహిళ మనసెరిగి మది
దోచుకొను వాడె ఘనుడూ
ఆమనసే విరిగి మరులు
గొనని వాడె వ్యర్థుడూ!         !మహిళ!
నీవు నేనొకటియే మనము 
మన మాటన్న మగవాడె ఘనుడూ!
నీవెవరొ నేనెవరొ యని
నయవంచనల్ జేయు వ్యర్థుడూ!  !మహిళ!
ఆడబ్రతుకన్న అధారబడుటన్న
అలవిగానీ మాట వినుడూ(తమ్ముడూ)!
ఒకరిమీదొకరు సహకరించుటన్న
మేలైన మాటయగు వినుడూ!  !మహిళ!
అహము వీడి మనము
మనమంత ఒకటియే అనుడూ!
నేను జెప్పెడు మాట మొండిగా
నిజమని పలుకబోకుమెపుడు వినుడూ!
                                           !మహిళ!
ఒకరు జెప్పిన విషయమే రీతి ఘనమగునొ
విడమర్చి చర్చించ మేలైన విషయమే వినుడూ!
మొండిగా వినుమనీ వినకున్న చూడుమని
కళ్ళురిమి చూడకూ యెపుడూ!  !మహిళ!
చిరునవ్వుతో జెప్ప దరహాసమును విడక
విడమరచి మాటాడ మర్యాద విడ బోకు మెపుడూ!
ఆడదనిన యెవరు ఆదిశక్తని యెరుగు
కార్యాచరణమున మంత్రిగా వ్యవహరించు యెపుడు !మహిళ!
నేను జెప్పిన మాట విని యాచరించగా
మంచి జరుగును కనుడూ
వినకున్న ఫలితమే రీతిగుండునో నీకెరుక గనవోయి తమ్ముడూ!!       ! మహిళ!

                    ********
             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)