బ్రతుకు గీతం!(పాటు)

భావగీతం/బ్రతుకు గీతం!
**********************
బ్రతుకు బాటకు
బడి బాట
      త్రోవ!
సర్కారు సారు
కిది ఘనమైన
       సేవ!
ఉచిత ముగ
నిచ్చేరు పుస్తకాలు
ఉచిత మధ్యాహ్నన్న
భోజన సంబురాలు!
'టై'లు,బెల్టులిచ్చి
సోకు గా సరిజేసి
చిట్టి పాపల చిరు
మోము జూడంగ
మాలిన్యమంటని
 మల్లెమొగ్గలె
       వారు!                   !! బ్రతుకు!!
ఆట పాటలతోడ
పాఠాలు నేర్పుతూ
పెద్ద తరగతి పిల్ల
మనసు లను రంజిల్ల
ట్రిక్కులెన్నో నేర్చి
శాస్త్ర సాంకేతికత
బోధనల్ విరియంగ
డిజిటల్ యుగమ్మె
విరాజిల్లుచుండగా
ప్రైవేటు దాటంగ
      పోరాటమే!              !! బ్రతుకు!!
సర్కారు సారు కిది
సంకుల సమరమట
బడిబాట ఫేలయితే
తాఖీదుతప్పదట
బడి మూతకు బాట
భవిష్యత్తు గుండెకోత
బడి లోని ఖాళీలు
ప్రభుతకార్థిక సంపదలు
ప్రైవేటుకివి సంబరాలు!
ఏయేటికాయేడు, పెరిగే
        దోపిడీలు!                  !! బ్రతుకు!!
మంచి చదువులున్న
సార్లు మాబడినుండిరని
నైతిక విలువలు నేర్పేటి
ధీరులే మన సార్లు
పైసఖర్చు లేక 
నాణ్యమైన చదువు
మా బడిలొ నున్నదని
సుద్దులెన్నొజెప్పి
సుదతులను నేతెంచ
వెనుక దిరిగి చూడ
వెక్కిరించె ఖాళీ!     
       పోస్టు                 !! బ్రతుకు!!
కల్లి బొల్లి మాటల
చెప్పి ఒప్పించుట
పాడి గాదు వినుడు!
వాలంటీర్లతోడ
కాలమ్ము గడుపగా
నిరుద్యోగి యింట
వేచి యుండ
వయసుడిగి పోవ
భావ్యమ్ము కాదని
యెరుగిన, ప్రజల
మనసు చూరగొనగ
        వచ్చు!!                 !! బ్రతుకు!!
        .....***....

         -------యెనిశెట్టి గంగా ప్రసాద్.
     








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)