ఉద్యమ వీరుడా!(కవిత)
ఉద్యమ వీరుడా!!
**************
అంతటోడు ఇంతటోడు రైతంటూ చెబుతావు
రైతు గోస చూడవేందిరో! ఓ రయ్యొ నీవు
రైతు బాధ వినవేందిరో! !!అంతటోడు!!
చట్టాలు చేస్తావు పక్కవేస్తినంటావు!
చుట్టమోలె చూస్తనంటుపట్టు వీడకుంటావు! !!అంతటోడు!!
పరిపాలనలో నీకు పూలబాట పరిస్తంటు
కల్లబొల్లి మాటలతో కబుర్లెన్నొ చెబుతావు
ఆ బాట లోని ముళ్ళ కంపనెరుగకుండ ఉంటావు! !!అంతటోడు!!
చట్టమంటు జేయగానె సంక్షేమం కూరదయ్య
లొసుగులేవొ జూడనెరుగ సవరించుట ముఖ్యమయ్య! !!అంతటోడు!!
రైతే రాజంటావు రాజరికం కానరాదు
పర్యవేక్షణ కొరవడితే పరితాపం తప్పబోదు!! !!అంతటోడు!!
సవరణలు చేయకుండ సత్వరన్యాయం జరుగబోదు
సహకారం లేకుండ సరి న్యాయం జరుగబోదురో!! !!అంతటోడు!
ఉద్యమాలు ఊపందితె దిగిరాకతప్ప దయ్య
న్యాయం నడిబొడ్డు నుండి ప్రశ్నిస్తూ నిలిచిందీ!! !!అంతటోడు!!
జయహో! ఉద్యమ వీరుడా! జయహో.....!
నిజం నిగ్గుదేల్చుదాక పోరాడీ గెలువవోయ్
జయహో! ఉద్యమ వీరుడా! జయహో! జయహో....!! !!అంతటోడు!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామారెడ్డి
సెల్:9866447234.
హరిదాసమాచారం గ్రూపు కు కవితా సంకలనం కొరకు పంపబడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి