పుస్తక దినోత్సవ సంబరాలు!(కవిత)
పుస్తక దినోత్సవ సంబరాలు!
*************************
పుస్తకాలు మస్తకాలకు
పనికల్పించే ఆయుధాలు!
పుస్తకాల దినోత్సవాలు
మస్తకాలకు సంబురాలు
ఛాత్రోపాద్యాయుల సమీక్షలు
స్వీకృత భావ సంపదలు
పుస్తకం హస్తభూషణం
మస్తకం భావుకుల వికేంద్రీకరణం!
ఈ-పుస్తకాల యుగం
డిజిటల్ కాలం నడుస్తూన్న
ప్రపంచీకరణ నేపథ్యంలో
పుస్తకాల దినోత్సవ ప్రేరణ
అభిలషణీయం! అమందానందకరం!
భావాలగమనం! సామాజిక ప్రయోజనం!
సమీక్షకుల భావసమ్మేళనం
బహుముఖ ప్రజ్ఞా పాటవం!
కవులకది ప్రేరణగా మిగిలిన జ్ఞాపకం!
******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి