వ్యంజకాలు!
వ్యంజకాలు!
***********
1.
కూలీ చేసుకుని బ్రతుకుతున్న ఉపాధ్యాయులని పోస్ట్ పెట్టిన యాజమాన్యం
తనవారికే జీతాలివ్వని వైనం!
2.
భౌతిక దూరం పాటించాలని చెప్పిన పెద్దలు
ఫోటో కోసం ఆ దూరాన్ని
ప్రక్కన బెట్టిన వైనం!
3.
ఫోటో కోసం జాగ్రత్తలు ప్రక్కన బెట్టారు
ఫోటో కోసం జాగ్రత్తగా కరోనా దూరింది!
4.
చదువు బాగా జెప్పండన్నాడు తండ్రి
తెల్లవారింది మొదలు వరుసగా
పదిరోజుల పాటు బడికి పంపలేదు.
5.
మా నాన్న స్మార్ట్ ఫోన్ లో రోజూ వాట్సాప్ ఫేస్ బుక్ చూస్తుంటాడు.
ఆన్ లైన్ పాఠాలనగానే
పదివేలు బెట్టి ఫోనెక్కడ కొనియ్యాలె అన్నాడు!
*******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి