సాగిపో ముందుకు..!(కవిత)

సాగిపో ముందుకు..!
******************
కలలుగన్న కార్మిక జనానికి
కాలగర్భంలో కి తీపి జ్ఞాపకం
ఎలాగూ చెక్కర చేదయ్యింది
చెరుకు అచేతనమయ్యింది
అనారోగ్యపు పొరలు క్రమ్మి
మధుమేహానికి కారణమయ్యావని
మధుర జ్ఞాపకాల్లోకి నెట్టేసింది
పోనీలే! పోరు బాట జ్ఞాపకాలు
పదిలంగా దాచుకో!
నీ వేదన నీలోనే నెగళ్ళొగదోయకుండ
నింగి వైపు తలయెత్తి
కన్నీటి బొట్లు రాల్చుకో!
మనసున్న మారాజులు
మద్దతిచ్చి యేలికల
మనసు కరుగదీయరా!
కార్మికా! కర్షకా! సాగిపో ముందుకు
                 ********
       
            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)