మహిళా!ఓ మహిళా!!(పాట)
మహిళా!ఓ మహిళా!!
*******************
మహిళా ఓ మహిళా
నువు మాన్యురాలవమ్మా. !! మహిళా!!
గుర్తెరుగనిగ్రుడ్డివాళ్ళు
కించపరచనెంతురమ్మ
నీవు లేక బ్రతుకు లేదు
నిక్కమిదే నమ్ముమమ్మ! !! మహిళా!!
సృష్టి వైచిత్ర్యమ్మున
చిధ్రమయే బ్రతుకు నీది
ఇదే అదనుగ యెంచి
అహం వీడకుండ జనం
ఆలోచనరహితులైరి. !! మహిళా!!
అమ్మ లాంటి దానవని
అవనికీవె మూలమని
యెంచనివారలైరి
దవులే మరి ధరలోన. !! మహిళా!!
మగవానికి మహనీయత
తెచ్చెడుదానవనీ
వెన్నంటే వుందు వీవు
వ్యధలను మరిపించగలదానవు.!!మహిళా!
సత్యా,కృష్ణులనీ
సీతా రాములనీ
ఉమామహేశ్వరులని
లక్ష్మీనారాయణులనీ
ముందే నీపేరు బలికి
గుర్తించిన సంస్కృతి మనదీ. !! మహిళా!!
సాహసానికూపిరివై
ధైర్యానికి మారుపేరు
చరిత గలిగియున్నదానవమ్మ
చెరపలేరు నీ కీర్తి. !! మహిళా!!
జీవితాన సగభాగం
దినచర్య లొసమభావం
పరిపాలన లోనీవు
పరిణితి నీదేనమ్మ. !! మహిళా!!
విద్యలోన నీవే
విలువిద్యలోన నీవే
చట్టసభలొ నీవే
పలు మంత్రాంగములందు నీవె
ఉండగలిగి నప్పుడె
న్యాయం నీవైపు నుండు. !! మహిళా!!
******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి