ఓటు విలువ!(కవిత)

ఓటు విలువ!
************
ఓటెందుకు దండగ
అనుకుంటిని ముందుగా
ఓటు విలువ తెలిసి వచ్చె
నోట్లు గుమ్మరించవట్టె
ఆసరా పథకాలు
ఆసరాగ నిలువవట్టె
మహిళల కల్యాణలక్ష్మి
మంచి గున్న వనవట్టిరి
వృద్ధాప్యం ఆసరా
ఆలంబనగా నిలువగ
దివ్యాంగుల దీవెనలే
కోటి దివ్వెల వెలుగు గా
రైతు బంధు పథకాలు
రైతులకొక తీపి గుర్తు
ఆత్మహత్య లాగిపోతె
ఇక నైనా బాగుండు
అవినీతి అంతానికి
పథకమొకటి ఉంటే
మరి యింకా బాగుండు!
ఆకర్షక పథకాలు,కావివి
జనాకర్షక పథకాలివి!
ఏవైతే నేం! ఓట్లు దండుకోడానికి
ఇహం,పరం కలిసి వచ్చె
అంతం కాదిది ఆరంభం మాత్రమే
అభివృద్ధికి సూచికగా
నిలిస్తే, నిలువెత్తు ధనరాశులు
ఓట్ల రూపంలో.....
అల్పసంతోషులమే, మేము
అందుకే, ఓటు విలువ తెలిసి వచ్చె
నోటుకమ్ముడుపోవద్దని!
ఓటు వేయముందర
ప్రశ్నించే హక్కు నీది
ఓటు వేసే బాధ్యతగా స్వీకరించినప్పుడే!!
                 **********
          
               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)