రైతు గీతం!(కవిత)
రైతు గీతం!
**********
బక్కచిక్కిన రైతు
బాగు యెన్నాల్లకో
పండించిన పంట
విలువయెన్నాల్లకో!
రైతు బంధు రక్ష
యెవరి బాగుకొరకొ
ఆసరా పథకాలు
ఆరోగ్యకరమైతె
లేనోడి కుండేను
భవిత భరోసా!!
పండినా పంటకీ
రక్ష యే పాటిదో!
కడుపు నిండా తిండి
కంటి నిండా నిద్ర
వచ్చు యెన్నాళ్ళకో!
రైతు పంటకు ధర
రక్తి కట్టే దెపుడొ!
పండించిన పంట
బంగారమగు నెపుడొ
బంగారు తెలంగాణ
బాట పడునెపుడో!
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి