పెన్షన్ నినాదం!(కవిత)
పెన్షన్ నినాదం!
**************
నాదం నినాదాల మధ్య
నలిగి పోతున్న నిజం
పెన్శన్ స్కీం!
సి.పి.యస్. వద్దని
ఓ.పి.యస్సె ముద్దన్న నిజం
ఇన్నాల్లకు తెలిసొచ్చింది
ప్రమాదం పొంచి ఉందని తెల్సినా
దీర్గ సూత్రుని విజ్ఞత పాటించిన
నాయకత్వం!
దెబ్బ తగిల్తె గాని తెల్సిరాలేదు,
సముద్రంలాంటి సంఘాలు
కులాలవారీగ వర్గాలవారిగా
పాయలై చీలి పోయాయి.
రిజర్వేషన్ల భూతం
సమైక్యతకు తూట్లు పొడుస్తుంటే
ఉద్యోగుల జీవన మూలస్థంబం
పెకిలించబడుతున్న విషయం
తెలియకున్నది!
మొదటి స్తంభపు పునాది
ఓ.పి.యస్!
కళ్ళు తెరిచిన నాయక గణం
పట్టువీడని విక్రమార్కులై పోవాలి
విభిన్న రాజకీయ రంగస్థలి ఏకమైతే
ఏప్రభుత్వ మైనా దిగిరాకపోతుందా!
పోరాడితేఫలితం రాకుండా పోదు
నీవిజ్ఞత నీధైర్యం నీకె ఫలితమిచ్చు
కదలిరమ్ము సోదరా! ఉపాద్యాయ సోదరా!!
....:::::;;....
--యెనిశెట్టి గంగాప్రసాద్
విశ్రాంత ప్రధానోపాద్యాయులు
కామారెడ్డి
సెల్:9866447234
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి