నిప్పు కణిక/సంవాదం (కవిత)

నిప్పు కణిక (సంవాదం)
             ********************
మండుతున్న నిప్పు కణిక "మరో!"అంటుంది
మందేది నన్నేమీ చేయలేదంటోంది
ఎందుకంటే నేను నిప్పు కణిక ను!
మందుకు దొరకను,మాకుకులొంగను
గాలికి కొట్టుకుపోను,నేనే గాలి ని
మండే గాలిని, మహమ్మారిని
మురికి లోంచి పుట్టలేదు
మురికి గుంటల్లో కి పడదోస్తాను!
                        *
మిత్రమా! దొరికినవులే
మురికి గుంటలే లేకుంటే
పడదోసే దెవరినీ పడిపోయేదెవరు?
పారిపో మిత్రమా! పడిలేచే కెరటంలా
వెళ్ళిపో! వెనక్కు
కదిలి పో కనుమరుగున ఉండిపో!
                         *
కదిలి పోవుటెక్కడికీ? వెనకడుగే లేదు నాకు
వేసిన ప్రతి అడుగు ముందుకే
భౌతిక దూరం లేక,బహుళ జనులు సాగలేరు
జనుల దేహమే నాకు ఆవాసం
మీ గుండె గొంతుకలోనే నా నివాసం
జారిపోతె చేరుదు, నీ శ్వాసకోశ నాళంలో
నాట్యమాడ నర్తన శాల యే యది
తకధిణతోం తద్దణకిణతోం!
తకిడతోం! తకిడతోం! తద్దణకిణతోం!
తోం!తోం! తోం!
                          *
ఆరో ప్రాణం లా ఉండిపోను నీతో
అడుగులో అడుగేసి అరంగేట్రం చేయలేను
ఆరడుగుల దూరంతో అడుగులేసి దూరంగా
శుభ్రత లో దీటగు నిబంధనల పాటించి
నీనుండి దూరంగా వైదొలగి ఉంటాను!
నెచ్చలివి కాకుండా దూరంగా తొలిగిపో
శాస్త్రజ్ఞుల పరీక్ష నాళికలలో బందీవై ఉండిపో!
                       ******
               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
                                      కామారెడ్డి
                         సెల్ 9866447234.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)