విమర్శకుడు!(కవిత)
విమర్శకుడు!
***********
విమర్ష విరుగుడు మంత్రంలాంటిది
విషపుగుళికలా అనిపించినా
రసగుళికలాంటిదే!
తప్పులసరిదిద్దుకోవడమనే
రసాయనిక క్రియకు మందై
ప్రశంసల పొరను క్రమ్మేసి
సానబెట్టిన వజ్రంలా ప్రకాశింపజేసే
కవితలు జాలువారుతాయి!
అందుకే విమర్షకుడు
విరుగుడు మంత్రం లాంటివాడు
స్వీకరింపదగిన ఆదరణీయుడు
ఏమంటారూ....!
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి