తెలుగు భాషా వైభవం!(కవిత)

తెలుగు భాషా వైభవం!
********************
దేశభాషలందు తెలుగు లెస్సటంచు
కవివర్యుడాముక్తమాల్యదను రచించె
జిగిపలుకులతొ విరచించె మనుచరిత్ర
నల్లసానివారు,అందముగను!
హాస్యోక్తులతోడ పద్యమాలికలల్లి
వికటకవియయ్యె! తెనాలిరామక్రిష్ణ!
సకలజనులకెల్ల మార్గదర్షిగ నుండి
తెనిగింపబడినట్టి మహాభారతమ్ము
అలరె కవిత్రయముల కలములందు
వాసికెక్కిన మహాభాగవతమ్ము
పోతన కలమున మెరుపులు మెరియంగ
ఎన్నెనొ కావ్యములవగతంబు
జ్ఞానపీఠమెక్కిన విశ్వనాథ,
భారధ్వాజలు వాసికెక్కినారు!
'విశంభర' విరచిత సి.నా.రె మెరిసె
మన తెలంగాణ ధ్రువతారగను ఇలలొ
జ్ఞానతృష్ణను గ్రోలిన కవులు మిగుల
సామాజిక హితముగోరి,
కాళోజి,ధాశరథులు,గూడ అంజన్న,
లలరించు గేయమాలికలెన్నొ,
పేరుపేరున కీర్తింపనెంచి
ధన్యులమయ్యెదముగాక కవివర్యులార!
పదునుపెట్టుడి మీ కలాలకింక
గళమెత్తి పాడగ ప్రభోదగీతమై మెరియులాగ
తెలుగు వెలుగుల మెరిపించునింగి మెరియ!
చాటరా నీతెలుగు భాషా వైభవమును!!!
                      .....:::::::.......
             
                ---------యెనిశెట్టి గంగాప్రసాద్ 
                                      కామారెడ్డి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)