మధురమైన జ్ఞాపకం!
మధురమైన జ్ఞాపకం!
******************
ఓ మగువా నీస్నేహం
మరువలేని మమకారం
మాతృత్వపు విలువ లోని
మధురమైన జ్ఞాపకం!!
చెంత నున్న చెల్లి ప్రేమ
చెలిముందర కనరాదే
చిదమాలని జూచువారె
చీత్కరింపబడువారే!!
విత్తు విలువ తెలిపేదీ
విజ్ఞతున్న క్షేత్రమే
మొలకెత్తిన మొలకలేను
ముందు తరం సంపదలే!!
భారం మోసేధరణికె
బాధ్యతెరుగునని తెల్యగ
నీ అడుగును మోసేదే
అవని లాంటి అతివ యెరుగు!!
పూజనీయురాలు పుడమి
పుణ్యచరిత పవిత్రతను
గుర్తించగ బూని రమ్ము
అతివయని అలుసుగ జూడకు!!
ఎవరికి వారే గొప్పవారు
ఎవరుతక్కువని యెంచకు
అల్పురెవరు? అధికులెవరు?
అధినాయకులెవ్వరూ?
ఆదిశక్తి పరాశక్తి అతివా
నిను నడిపే బలమే నీమగువా!
నీ గర్వం గౌరవమ్ము నిల్పు
నెలతయె నీ విలువా!!
వందనమని అభినందనలని
అనవోయీ సోదరా!
మాననీయురాలని మదినెంచీ
ఆదరించు సోదరా!!
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి