ఆర్టీసీ....!(ఉద్యమ గీతం)
ఆర్టీసీ....!(ఉద్యమ గీతం)
***********************
రాతిని నాతిగ మార్చిన రాముడుండెనాడు
ఈ రాతిని కరిగించగ యేరాముండీనాడు
ఒకడు తప్పుజేయజూపి,తాను తప్పుజేయదలచె
ఘనుడెవడు,దుర్జనుడెవడు
తెలుసుకోండి మీరు. !! రాతిని!!
కేంద్రము ప్రైవేటు జేయు రైళ్ళనాప శక్తి లేక
ఆర్టీసిని ప్రైవేటు జేయనెంచె నేడు
విజ్ఞుడెవడు విబుధుడెవడు
స్వచ్ఛులెవరు,మ్లేచ్ఛులెవరు. !! రాతిని!!
యజ్ఞాలు యాగాలు జేయ ఫలితమిదేనా
ఎవరి బాగుకొరకు,యాగఫలితమెవరికొరకు?
ఉద్యోగులు మనుషులని యెంచలేవ నేతా! పథకాలు పొందినట్టి ప్రజలేనా నేతా! !! రాతిని!!
గద్దెనెక్కినట్టి నేతలే రాజు లందురుగద
రాజు యనినరాముండే రామరాజ్యమేదీ?
రామయనిన,రాజుమహిమయనియెరుగవా?
ప్రజాసేవయే మా కర్తవ్యమ్మని రానాడు
నేటి దాక జీవితాల ధార బోసినారు. !! రాతిని!!
రిటైరైన వారి కెంత పెన్షనిచ్చి నావూ
తెలిసుండీ మౌనముద్ర యేలనయ్యనీకూ
ప్రభుత్వమ్ములోన విలీనమ్ముజేయుమంటూ
కోరిన కోరిక సబబని నీవెంచూ
నష్టాలనిబొంకి ప్రైవేటును బూచి జూపి
ప్రజల మభ్యబెట్టనెంచి
ఎన్నాళ్ళుగ యీతీరుగ రాజ్యమేలగలవు!! రాతిని!!
సకల జనులు జెప్పవట్రి మద్దతీయ ముందుకొచ్చి
తగదు తగదు తగదు నీకు తగదు పాలకుండా
యీతీరు నీకు యేమాత్రం ఒప్పదు పరిపాలకుండ!! !! రాతిని!!
***********
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి