కవితలు!
కులాల కుంపట్లనెగదోసెడు వాడు
పుస్తకాలెన్నైన వ్రాయనెంచు,
మతవాదులపట్ల కసిగలవాడెవడైన
విమరసలెన్నైన చేయనెంచు,
భావసమైక్యతకు కృషిజేయనెంచెడు
మనిషి గాని,
వర్గవిభజన కోరెడు
రచనలు సేయగోరెడు వారు,
రచయితలు కాబోరు
వాసికెక్కనెంచి వార్తలకెక్కుచు
వాతలేగొందురు
విశ్వమందిది నిజము
గనుడు మీరు!!
............
యెనిశెట్టిగంగాప్రసాద్
కామారెడ్డి
కన్నీటి సిరాతో కలం పట్టి
వ్రాసేదొక్కటే కవిత్వమైతే
జీవితమంతా కన్నీటిమయమే!
బాదాతప్త హృదయాలకు
స్పందన కవిత్వం రూపు దిద్దుకోవచ్చు
అలాగే స్పూర్తి నింపే కవిత్వమూ కవిత్వమే!
వినోదపూరిత కవిత్వమూ
కన్నీటి హృదయాలకో స్వాంతన!
హృదయాన్ని స్పందింపజేసేదేదైనా కవిత్వమే!
.....యెనిశెట్టి గంగాప్రసాద్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి