మహిళ!(కవిత)

మహిళ!
********
మహిళ లేని మగవాడెక్కడ
మగడు లేని మహిళ యెక్కడ
ఇద్దరూ నాణేనికి బొమ్మా బొరుసే
బండి చక్రాలు రెండు ఒకేవిధంగా
నడుస్తాయి!
వాటికి చిన్నా,పెద్దలుండవు
ఎక్కువ తక్కువలుండవు!
కుటుంబం బండికీఅంతే
ఆడా,మగా రెండూ రథచక్రాలే
ఒకరు లేక మరొకరు లేరు!
ఈ సత్యం యెరిగితేనె
కుటుంబం బాగు బాగు!
కుటుంబాలు యెదిగితేనె
వ్వవస్థే బహు బాగు!!
         ******
       --మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో...

             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)