గెలుపెవరిది?(కవిత)
గెలుపెవరిది?
************
ఉత్కంఠ పోరులో
ఉప్పెనొచ్చింది
ఆ ఉప్పెనలొ
ఇంగ్లాండు
కొట్టుకొచ్చింది
కప్పు పట్టుకొచ్చింది!
*****
పోరాడి పోరాడి
అలసిపోయింది
ఓడినా యాదిలో
నిలిచియే ఉంటది
కీవీసు జట్టుకది
కొద్దిలో తప్పింది
కొదమ సింఘమోలె
పోరాడి ఓడింది
ఓటమి కాదది
ఓటమి లో గెలుపు
గెలుపు లో ఓటమి
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
***ఇంగ్లాండు-న్యూజీలాండు జట్ల మధ్య జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లో "టై" సూపర్ ఓవర్లో కూడా "టై" ఫోర్లు సంఖ్యా పరంగా ఇంగ్లాండ్ గెలుపు.అంటే సాంకేతిక గెలుపు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి