ఏం వ్రాయాలి?(కవిత)

ఏం వ్రాయాలి?
**************
ఏం వ్రాయాలి?
వ్రాయాలి, ఏదో వ్రాయాలి
ఎండకన్నెరుగని కన్నె
గురించి వ్రాయనా!
ఎండవానకోర్చి
బ్రతుకు తెరువు కై
భవిత సుదూరంలో లేదని
బ్రతుకు బండి లాగుతున్న
అమ్మా,నాన్నలకాసరాగా
నిలుస్తున్న అమ్మాయి గురించి వ్రాయనా!
అక్షరం ముక్క రాకున్నా
జీవన సత్యాలను పాటకట్టి
పాడుతున్న తంబురా
గురించి వ్రాయనా!
ఏం వ్రాయను, ఎలా వ్రాయను?
రానున్న కాలానికి దిశానిర్దేశం చేసే
రాజకీయం గురించి వ్రాయనా
సామాన్యుల వేదనలోని
ఆక్రోశం గూర్చి వర్ణించనా!
ఏం వ్రాయను? ఏమనివ్రాయను!
శ్రీ శ్రీ లా గళం లేదు
సిరి వెన్నెల రాగం లేదు
విశ్వనాథుని లోని పట్టులేదు
వేమనవాదం అబ్బలేదు
భావాలుంటే భాషతోడు రాదు
భాష ఉంటే భావాలొకచోట
కుదురుగా ఉండవే...
ఈ రెండింటి కీ అన్వయం కుదిరితే
దిట్టంగా వ్రాయగలను
దండిగా వ్రాయగలను
అప్పటిదాకా కవిగా గార్చే
కన్నీటి ఆశ్రువులుగా
నిల్చే ఈ నాలుగక్షరమ్ముక్కలే
ప్రపంచ కవిత్వానికి ఆసరాగా .....!
నిలుస్తాయి!

       --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
                  సెల్: 9866447234.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)