అసంపూర్తి కవిత!

అసంపూర్తి కవిత!
***************
కలివిడి తనమున
కరచాలనమున
కరోనయేలును
కాలము తీరును!!

మదనుడి తాపము
కామవిలాపము
ప్రేమకలాపము
హాసవిలాసము!!

భౌతిక దూరము
నోటికి మాస్కులు
చేతికి శుభ్రత
కరోన దూరం!

బ్రతుకొక వరమై
వెలిగిన వెలుగులు
నీటి బుడగలా
నేటి నిజాలే!!

భ్రమలో మునిగిన
బ్రతుకున నిజాలు
భయంనీడలో
పునాది కదులును!!

వయసున కోరిక
తీరని తాపం
చేదు నిజాలు
అన్నీ ఒకటే!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)