సమరానికి ముగింపు (గేయం)

సమరానికి ముగింపు!
**************
సమసిపోని సమరానికి  సన్నద్ధం
కణజీవి రూపాంతరమే నిదర్షణం
వేసినవెనకడుగే సాగుతోంది ముందుకూ
కదంత్రొక్కి కరవాలం ఝళిపిస్తోందెందుకూ
బ్రతుకు పోరు బాటలోన బాధ్యతనే మరిచిరీ
నిబంధనల గీతలన్ని దాటవేసి సాగిరీ
సీతగీతదాట,నాడు సిత్రాలు చూడలేద
సివంగిలా నాట్యమాడ చిత్తరువై నిలుచుటేల
రాచరికపు టడుగులేవి రగిలించవు జ్వాలనూ
మాడి మసై పోబోదు మరిచిపోని జ్ఞాపకం
శోధనలో సాధించిన వాక్సినే ఆయుధం
జరామరణ దుఃఖాలకు స్వాంతనయై నిలుచునూ
వాక్సినేసుకున్నాని మురిసి పోకు తమ్ముడూ
ముందస్తు జాగ్రత్తల గుర్తించిన చాలును
భయంవీడి వాక్సినుతో పోరాటం సాగించు
బలాదూర్ కరోనా! పారిపోవు కరోనా!!
                    *****
           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
                                   కామారెడ్డి
                        సెల్: 9866447234.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)