నిశ్శబ్ద సంకేతం (కవిత)

నిశ్శబ్ద సంకేతం...!
****************
విద్య వినయాన్ని నేర్పుతుందనుకున్నా
వివేకాన్ని మేల్కొలుపు తుందనుకున్నా!
అహాన్ని పెంచుతుందనుకోలే....!
మూఢత్వాన్ని ముందుంచుతుందను కోలే!!
అంధ విశ్వాసాన్ని ఆదరిస్తుందనుకోలే!!
అడుగు వర్గాల నణచి వేస్తుందనుకోలే!
అంతులేని సంపద ను ప్రోగు చేసుకొని
పుణ్యం కోసం వెంపర్లాతుందనుకోలే!
దానాలు ధర్మాలు చేసి పేరు కోసం ప్రాకులాడుతుందనుకోలే!!
పేదవాడి నాదుకోవాలన్న ఆరాటం
వయసు పైబడి నప్పుడు పుట్టే
ఆలోచనల ఫలితమనుకోలే...!
పాపం చేయకుంటే పుణ్యం ప్రసక్తే లేదు!
పాప పుణ్యాలనేవి లేనప్పుడు
స్వర్గ నరకాలు లేవన్న మాటే
ఇవేవీ లేనప్పుడు,
బ్రతుకు బాటకు మార్గం!
నిశ్శబ్ద సంకేతం.....!!
            *****
           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
                                   కామారెడ్డి
                    సెల్: 9866447234.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)